close

మలేషియాలో తెలుగు భాషా దినోత్సవం

కౌలాలంపూర్‌: ప్రపంచ తెలుగు భాషా దినోత్సవాన్ని మలేషియా తెలుగు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కౌలాలంపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ కవి, తెలుగు సీనీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు హాజరయ్యారు. జొన్నవిత్తుల రాసిన పాటలు, కవితలను కార్యక్రమంలో వినిపించారు. భాషాభివృద్ధి కోసం కృషి చేసిన గిడుగు వెంకట రామ్మూర్తి సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన పుట్టినరోజు ఆగస్టు 29ను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడాన్ని మలేషియా తెలుగు ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఆర్‌.కాంతారావు అక్కునాయుడు ప్రశంసించారు. ఇలా జరుపుకోవడం వల్ల ఈ సంస్కృతిని భావితరాలు సైతం కొనసాగిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మలేషియా తెలుగు సంక్షేమ, సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

వార్తలు / కథనాలు

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.