జనసేనపై కుట్ర చేస్తున్నారు
పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
ఈనాడు అమరావతి: జనసేన పార్టీ నాలుగేళ్లు కూడా నిండని పసిబిడ్డ అనీ, ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదంతా రాజకీయంలో ఓ భాగమే అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ శ్రేణుల్నీ, అభిమానుల్నీ గందరగోళపరచడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయనీ ఇదంతా ఓ కుట్ర అని ఆరోపించారు. జనసేనను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారనీ, పవన్‌కల్యాణ్‌పై విశ్వాసం ఉందని చెప్పారు. కువిమర్శలు చేసేవారిని విస్మరించాలని సూచించారు. తమపై విమర్శలు చేసేవారి పట్ల పార్టీ శ్రేణుల ప్రవర్తన ఎలా ఉండాలో పవన్‌కల్యాణ్‌ గత ఏడాది అక్టోబర్‌ 7వ తేదీన ప్రకటన చేశారన్నారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను మరోసారి విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.  వ్యక్తిగతంగా నాపై విమర్శలు చేసినా, నాకు అపకీర్తి వచ్చేలా మాట్లాడినా... అలాంటివారిపట్ల హుందాగానే ప్రవర్తిద్దామని తన శ్రేణులకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నాటి ప్రకటనలో సూచించారు. కొందరు పేరు కోసమో, పార్టీ దృష్టిని మరల్చేందుకో, చికాకుపెట్టేందుకో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అలాంటివాటిపై ఎవరూ స్పందించవద్దని విజ్ఞప్తి చేశారు.

రాజకీయం

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.