close

తాజావార్తలు

అందుకే శబరిమలలో ఆందోళనలు
కేరళ సీఎం

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి ప్రవేశించడానికి మహిళలందరికీ అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో అందుకు వ్యతిరేకంగా కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళనలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పలువురిపై ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇతర ఆలయాలన్నింటి కన్నా శబరిమలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలోకి అందరూ ప్రవేశించవచ్చు. ఈ విషయం పట్ల సంఘ్‌ పరివార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఎల్లప్పుడూ అసహనంతో ఉంటుంది. ఆ ఆలయానికి ఉన్న ఈ ప్రత్యేకతను చెడగొట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది’ అని ఆయన ట్వీట్ చేశారు.

‘కుల, ఫ్యూడల్‌ భావజాలాల వల్ల ప్రేరేపితులు కావడం వల్లే ఆందోళనకారులు హింసకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఆందోళనలను ప్రోత్సహిస్తే సమాజంలో వెనకబడిన తరగతుల వారు కూడా శబరిమలకు రాకుండా నిషేధం విధించేలా పరిస్థితులు తలెత్తుతాయి. ఈ పరిణామాలను భక్తులందరూ ఖండించాలి’ అని మరో ట్వీట్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళయాల సమాజానికి చెందిన ఆదివాసీలు శబరిమలలో నిర్వహించే ఆచారాలను ఇప్పటికే కొందరు పూర్తిగా లేకుండా చేశారని, ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలను కూడా ఆ దృష్టిలోనే చూడాలని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు భక్తులను అడ్డుకుంటున్నారని, చెడును ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా, నిన్న శబరిమల ఆలయాన్ని పూజాదికాల కోసం తెరిచిన నేపథ్యంలో మహిళలు ప్రవేశించకుండా ఆందోళనకారులు పలు చోట్ల దాడులకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.


సినిమా

మరిన్ని

రాజకీయం

జనరల్‌

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.