close

తాజావార్తలు

జనసేనలో చేరిన తితిదే మాజీ ఛైర్మన్‌
సాదరంగా ఆహ్వానించిన పవన్‌కల్యాణ్‌

హైదరాబాద్‌: జనసేన పార్టీలో మరో కీలక నేత చేరారు. తితిదే మాజీ ఛైర్మన్‌, తిరుపతి మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆయన్ని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విటర్ ద్వారా ప్రకటించింది. పవన్‌ బాణం విసురుతున్న ఫొటోను, కృష్ణమూర్తితో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. అనంతరం పవన్‌, కృష్ణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటుచేశారు.

తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేతగా ఉన్న చదలవాడ కృష్ణమూర్తి గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన తిరుపతి నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) బోర్డు ఛైర్మన్‌గా అవకాశం కల్పించారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయన తెదేపాకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీలో చేరనున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను చదలవాడ గానీ, జనసేన వర్గాలు గానీ ఖండించలేదు. ఈ క్రమంలోనే ఆయన గురువారం పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి ఆ పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ గత వారం జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అటు కాంగ్రెస్‌ నుంచి, ఇటు తెదేపా నుంచి కీలక నేతలు తమ పార్టీలో చేరినందున ఎన్నికల లోపు ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి.


రాజకీయం

జనరల్‌

సినిమా

మరిన్ని

క్రైమ్

మరిన్ని

స్పోర్ట్స్

మరిన్ని

బిజినెస్‌

మరిన్ని

జాతీయ-అంతర్జాతీయ

మరిన్ని
జిల్లా వార్తలు
జిల్లా తాజా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |    Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.