Independence Day: స్వాతంత్ర్య స్ఫూర్తి.. 15న లఖ్‌నవూలో వినూత్నంగా..!

‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వినూత్న దేశభక్తి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. పంద్రాగస్టు రోజున యూపీ రాజధాని.....

Updated : 11 Aug 2022 20:01 IST

లఖ్‌నవూ: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌’లో భాగంగా పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వినూత్న దేశభక్తి కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. పంద్రాగస్టు రోజున యూపీ రాజధాని లఖ్‌నవూ వ్యాప్తంగా జాతీయ గీతాలాపనతో స్వాతంత్ర్య స్ఫూర్తిని చాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 రోజున సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మువ్వన్నెల జెండాను ఎగురవేసిన తర్వాత 52 సెకెన్ల పాటు పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌ ద్వారా జాతీయ గీతాన్ని వినిపించనున్నారు. ఆ సమయంలో లఖ్‌నవూ వ్యాప్తంగా ఉదయం 9గంటల వరకు ఎక్కడివారు అక్కడే నిలబడి తమ దేశభక్తిని చాటనున్నారు. ఇందుకోసం నగర వ్యాప్తంగా 100 క్రాసింగ్‌లలో జాతీయ గీతాన్ని వినిపించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మినిట్‌ టు మినిట్‌ అప్‌డేట్స్‌ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ (www.lucknow.nic.in)లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు