|
|||||
![]() రండి.. ఆడేద్దాం
ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌కు రంగం సిద్ధం విజయం సాధించాలనే కసి.. గమ్యాన్ని చేరాలనే తపన.. ఎవరితో అయినా పోటీ పడే ప్రతిభ, నైపుణ్యాలు మీ సొంతమా? అయితే మీ కోసమే ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్) సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల కళాశాలల క్రీడల్లో అతి పెద్ద ఆటల పండుగకు వేళైంది. గత పన్నెండుళ్లుగా ఎంతోమంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చిన ఈనాడు ఛాంపియన్ క్రికెట్ (ఈసీసీ) కప్.. మూడేళ్లుగా క్రికేటేతర ఆటల్లో వర్ధమాన క్రీడాకారులను ప్రపంచానికి పరిచయం చేసిన ఈనాడు ఛాంపియన్స్ క్రీడలు ఇప్పుడు ఒక్కటై.. ఈఎస్ఎల్గా రూపుదిద్దుకుంది. క్రికెట్, చెస్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ (100 మీటర్లు, 200 మీటర్లు), బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో ప్రతిభావంతుల్ని వెలికి తీసేందుకు ఈఎస్ఎల్ సర్వసన్నద్ధంగా ఉంది. బరిలోకి దిగడంలో.. ఇక మీదే ఆలస్యం! ఈనాడు - హైదరాబాద్ క్రికెట్.. క్రికెట్ బాలుర జూనియర్ విభాగంలో ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ.. సీనియర్ విభాగంలో డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ, మెడికల్, ఫార్మా కళాశాలలు ఈఎస్ఎల్ క్రికెట్లో పాల్గొనవచ్చు. జిల్లా.. ప్రాంతీయ స్థాయిల మ్యాచ్‌లు నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఫైనల్స్‌కు హైదరాబాద్ వేదికగా నిలుస్తుంది. అమ్మాయిల క్రికెట్లో జిల్లా స్థాయి క్రికెట్ సంఘాల తరఫున మహిళల జట్లు ఈఎస్ఎల్లో పాల్గొనవచ్చు. తెలంగాణలో మాత్రం ఉమ్మడి జిల్లాలే ప్రాతిపదిక. అనంతరం ప్రాంతీయ స్థాయిలో నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ప్రాంతీయ స్థాయి విజేతలు హైదరాబాద్‌లో తుది దశ పోటీల్లో తలపడతాయి. తుది దశ పోరు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. బ్యాడ్మింటన్.. వాలీబాల్.. చెస్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ (100 మీటర్లు, 200 మీటర్లు), బ్యాడ్మింటన్ (సింగిల్స్, డబుల్స్) క్రీడాంశాల్లో జూనియర్ కళాశాలల బాలబాలికలకు పోటీలు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, 10+2 చదువుతున్న విద్యార్థులు/ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. వయసు 16 నుంచి 19 ఏళ్లలోపు ఉండాలి. 2000 డిసెంబరు 5వ తేదీ, ఆ తర్వాత జన్మించిన వారే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు. వయసు నిబంధనలు బాలుర విభాగంలో జూనియర్స్- 18 ఏళ్లలోపు (05-12-2001న, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). సీనియర్స్- 24 ఏళ్లలోపు (05-12-1995న, ఆ తర్వాత జన్మించిన వాళ్లు). అమ్మాయిల క్రికెట్లో క్రీడాకారిణుల కనీస వయసు 12 ఏళ్లు. గరిష్ట వయసు 24 ఏళ్లు. (5-12-1995 నుంచి 05-12-2007 మధ్య జన్మించిన వారే అర్హులు) ట్రోఫీ ఆవిష్కరణ ఈనాడు స్పోర్ట్స్ లీగ్ (ఈఎస్ఎల్)కు జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. సోమవారం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగే కార్యక్రమంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్- 2019 ట్రోఫీని ఆయన ఆవిష్కరించనున్నాడు. ఎంట్రీల నమోదు పూర్తి చేసిన దరఖాస్తులను డిసెంబరు 9వ తేదీలోపు సంబంధిత జిల్లాలోని ఈనాడు కార్యాలయానికి పంపాలి. దరఖాస్తు ఫారం, మరిన్ని వివరాలు www.eenadu.net లో చూడొచ్చు. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ఈనాడు స్పోర్ట్స్ లీగ్, ఈనాడు ఈవెంట్స్, ఈనాడు కాంపౌండ్, సోమాజిగూడ, హైదరాబాద్- 500082. వివరాలకు 9100024085, 8008624949 (ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు. వారెవా.. ఏమి ఫోజు ఫొటోలకు పోజులివ్వడం మీకు ఇష్టమా? అయితే ఈఎస్ఎల్ మ్యాచ్‌ల సందర్భంగా మైదానంలో ఏర్పాటు చేసిన ‘సరదా పోజు’ తరహాలోనే ఫోజు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని మెసెంజర్లో ESL- Eenadu Sports league కు పంపించాలి. బాగున్న వాటిని ఫేస్బుక్ పేజీలో పోస్టు చేస్తారు. వాటిల్లో ఎక్కువ ఆదరణ పొందిన ఫోటోలకు బహుమతులు అందిస్తారు. వీడియో పెట్టు.. ప్రైజు పట్టు ఆటల్లో దృశ్యాల్ని వీడియోల్లో బంధించడం మీకు అలవాటా? అయితే ఈ పోటీ మీ కోసమే. మీరు చేయాల్సిందల్లా.. ఈనాడు స్పోర్ట్స్ లీగ్ సందర్భంగా మైదానంలోని ఆటగాళ్ల సరదా సన్నివేశాలను వీడియోలు తీసి మెసెంజర్ ద్వారా ESL- Eenadu Sports league కు పంపించడమే! మ్యాచ్‌లోనే కాకుండా బయట వీక్షకుల గ్యాలరీలో సరదా సంఘటనల్ని వీడియోలు తీసి పంపిచవచ్చు. వాటిల్లో బాగున్న వీడియోలను పంపించిన వాళ్ల పేర్లతో ట్యాగ్ చేసి నిళీలి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేయడంతో పాటు.. ఎక్కువ ఆదరణ పొందిన వీడియోలకు బహుమతులు అందజేస్తారు. |
|||||
|