Array
(
  [0] => stdClass Object
    (
      [aalayaalu_id] => 25
      [aalayaalu_mst_id] => 25
      [aalayaalu_description] => 

భద్రాచలం దేవస్థానం

భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు, మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమ భక్తవరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికి ఇచ్చిన వరం ప్రకారం... సీత.. లక్ష్మణ.. ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థలపురాణం! ఇక్కడి శ్రీరామచంద్రుడ్ని భక్తులు ప్రేమగా వైకుంఠ రాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు.

క్షేత్ర చరిత్ర/ స్థల పురాణం

ద్రాచలానికి కేవలం పురాణ ప్రాశస్త్యమే కాదు.. ఘనమైన చరిత్ర కూడా ఉంది. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తిశ్రద్ధలో శ్రీరాముడిని కొలుస్తుండేది. ఆ మహా భక్తురాలి భక్తికి మెచ్చి ఒక రోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడట! తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం... భద్రగిరిపై ఉన్నానని.. నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చెయ్యండి.. ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సాయంగా నిలుస్తాడు.. అని ఆదేశించారట! ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి.. భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పండ్లు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందట. ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది.

అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానీషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న, మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలుకా తహశీల్దారుగా పదవీబాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడి గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్‌దాస్‌ శిష్యుడైన శ్రీ రామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి.. ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు ఆరు లక్షల మొహరీలతో తన దైవం.. భద్రాచల శ్రీరామచంద్రుడికి ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు!

ఈ విషయం నవాబ్‌ తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులు ఇస్తాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా... ఇక నా దగ్గరేమీ మిగల్లేదు ప్రభూ.. అని విన్నవిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి.. బందిఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 ఏళ్ల పాటు రామదాసు ఆ బందిఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాసు ప్రార్థనలు ఫలించి.. శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి.. తానీషాకు బాకీ సొమ్ము 6 లక్షల మొహరీలు చెల్లించి.. రశీదు తీసుకొని మరీ రామదాసును బందిఖానా నుంచి విముక్తం చేశాడట! ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్యదైవమైన శ్రీరాముడితో పాటు.. సీత.. లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు... తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మొహరీలు.. ఉత్సవ సామగ్రి.. అప్పటి శాసనాలు.. పరికరాలు ఆలయంలో చూడొచ్చు. సుమారు 35 కి.మీ.ల దూరంలో ఉండే.. పర్ణశాలలో.. రామాయణ కాలంలో శ్రీరాముడు.. సీత.. లక్ష్మణుడున్న పర్ణశాల.. రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ.. జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకొనే ఆధారాలు చూడొచ్చు.

ఈ ఆలయంలో శ్రీపాంచరత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్యపూజలు.. ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.

దర్శనవేళలు

* రోజూ ఉదయం 4.30 గంటలకు ఆలయ తలుపులు తెరుస్తారు. సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
* ఉదయం 5.30 నుంచి 7 గంటల వరకు బాలభోగం నివేదన. ఆపై ఉదయం 8.35 నుంచి 9.30 వరకు సహస్ర నామార్చన.. ఈ పూజలో పాల్గొనేందుకు రూ.100 టిక్కెట్‌పై ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు.
* ఉదయం 8.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అర్చనలుంటాయి. వీటిల్లో రూ. 150 టిక్కెట్‌ ద్వారా పాల్గొనవచ్చు.
* ప్రతిరోజూ ఉదయం 9.30 గంటలకు మొదలయ్యే స్వామివారి నిత్యకల్యాణంలో పాల్గొనేందుకు రూ. వెయ్యి చెల్లిస్తే.. ఒకరు.. లేదా దంపతులను అనుమతిస్తారు.
* ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాజభోగం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ ఆలయాన్ని మూసేస్తారు.
* రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు దర్బార్‌సేవ జరుగుతుంది. 8.30 గంటల నుంచి 9 గంటల వరకు నివేదన. పవళింపు సేవ ఉంటుంది.

ముఖ్యమైన పూజలు

అభిషేకాలు

* ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు ప్రతిరోజూ భద్రుడి మండపంలో స్వామివారి పాదాలకు అభిషేకం జరుగుతుంది. టిక్కెట్‌ ధర రూ. 100. ఒక్కరు లేదా దంపతులకు ప్రవేశం. ప్రతి ఆదివారం మూలవరులకు అభిషేకం జరుగుతుంది. ఈ సేవలో పాల్గొనేందుకు రూ. 1100 చెల్లించాలి.
* ప్రతి శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు లక్ష్మీతాయరు అమ్మవారికి అభిషేకం చేస్తారు. ఇందులో పాల్గొనేందుకు రూ. 100 చెల్లించాలి. ఒక్కరు లేదా దంపతులకు అనుమతిస్తారు.
* ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి వారికి జరిగే అభిషేకంలో పాల్గొనేందుకు రూ. 100 చెల్లిస్తే.. ఒక్కరు లేదా దంపతులను అనుమతిస్తారు.
* ప్రతి శనివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీయోగానంద లక్ష్మీనరసింహా స్వామివారికి నిర్వహించే అభిషేక సేవలో పాల్గొనేందుకు రూ. 100 చెల్లిస్తే.. ఒక్కరు లేదా దంపతులకు అవకాశమిస్తారు.

శాశ్వత సేవలు

* శరన్నవరాత్రుల్లో 9 రోజులపాటు శ్రీ మద్రామాయణ పారాయణ చేసేందుకు రూ. 10,000.
* (శ్రీరామనవమి మినహా.. మిగతా రోజుల్లో) స్వామివారి శాశ్వత కల్యాణం జరిపించేందుకు... రూ. 10,000.
* శరన్నవరాత్రి, ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో ఒక్కో అలంకారానికి రూ. 10వేలు.
హంస, గరుడ, అశ్వ, సూర్యప్రభ, సేవల శాశ్వత ఉభయదాతలకు... రూ.5,100 (బోయిల ఖర్చు అదనం)
* ఏటా ఒక రోజు శాశ్వత భోగం చెల్లించేందుకు రూ. 1,116, శాశ్వత ఉచిత ప్రసాద వియోగానికి రూ. 1,116
* ఏడాదిలో ఒక్కరోజు శాశ్వత అన్నదానం చేసేందుకు(ఆరుగురికి..) రూ. 1,116.
* భద్రుని కోవెలలో శాశ్వత అభిషేకం(ఏటా ఒక్కరోజు) రూ. 1,000
* (ఏటా ఒక ఏకాదశి రోజున) శాశ్వత లక్ష కుంకుమార్చనకు.. రూ. 2,500
* ఆలయ చుట్టు సేవకు.. రూ. 500.. నిత్య కల్యాణంలో పాల్గొనేందుకు.. రూ. 1000
* వడమాల భోగం: రూ. 200, చక్కెర పొంగలి(కేజీ) భోగంకోసం.. రూ.300, (ఆదివారం) సువర్ణ పుష్పార్చన రూ. 500 చొప్పున చెల్లించాలి.

వసతి సౌకర్యం

భద్రాచలం రామాలయ పరిధిలో 10 ఏసీ కాటేజీలున్నాయి. ఒక్కో గదికి రోజుకు రూ. 1500. నాన్‌ ఏసీ కాటేజీలు 10 ఉన్నాయి. వీటిల్లో ఒక్కో గదికి రోజుకు రూ. 800 చొప్పున చెల్లించాలి.
* కాటేజీలు కాకుండా మరో 46 నాన్‌ ఏసీ గదులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గది ధర రూ. 300
* ఏసీ గదులు 64 అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గదికి రూ. 800 నుంచి రూ. 1100 వరకూ (గిరాకీని బట్టి) చెల్లించాలి.

రవాణా సౌకర్యం

హైదరాబాద్‌కు సుమారు 310 కి.మీ.ల దూరంలో వుండే భద్రాచలం దట్టమైన అటవీప్రాంతంలో ఉంటుంది. జిల్లాకేంద్రం ఖమ్మం నుంచి సుమారు 115 కి.మీ.ల దూరముంది. జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ/ ప్రైవేటు బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమండ్రి.. విశాఖపట్నం.. విజయవాడ నుంచి నేరుగా బస్సు సౌకర్యముంది. ఖమ్మం వరకూ లేదా సుమారు 35 కి.మీ.ల దూరంలోని భద్రాచలం రోడ్‌ రైల్వేస్టేషన్‌ (మణుగూరు) వరకూ రైల్లో వచ్చి.. అక్కడి నుంచి బస్సు లేదా కారులో వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి 135 కి.మీ. దూరం ఉంటుంది. రాజమండ్రి నుంచి రెగ్యులర్‌గా గోదావరి పడవలు భద్రాచలం వెళ్తుంటాయి. గోదావరిలో నీటిప్రవాహం బాగుంటే.. నౌకలో.. నదిలో.. పాపికొండలు మీదుగా భద్రాచలం వెళ్లడం జీవితకాలంలో మర్చిపోలేని మధురానుభూతిని అందిస్తుంది.

వెబ్‌సైట్‌: http://www.bhadrachalarama.org లో లాగిన్‌ అయి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు.

[aalayaalu_isactive] => t [aalayaalu_createdby] => admin [aalayaalu_createddate] => 2018-12-22 13:23:29.173791 [aalayaalu_ipaddress] => [aalayaalu_modifiedby] => [aalayaalu_modifieddate] => [aalayaalu_tags] => [aalayaalu_isfeature] => 0 [aalayaalu_name_telugu] => భద్రాద్రి [aalayaalu_main_image] => [aalayaalu_thumb_image] => eeimages/aalayaalu/thumbimage/badra.jpg [aalayaalu_name_english] => badrachalam ) ) Array ( )
Devatharchana - EENADU
close

భద్రాద్రి

జిల్లా వార్తలు


రుచులు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.