స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలు

తాజా వార్తలు

Updated : 14/11/2020 11:24 IST

స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలు

అమరావతి: విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి జన్మదిన వేడుకల్ని జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేసింది. ఈనెల 18న ఆయన జన్మదినం సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళంలోని అరసవల్లి సూర్యదేవాలయం, ద్వారకా తిరుమల, రామతీర్థం, సింహాచలం, కనక మహాలక్ష్మి, అన్నవరం, అంతర్వేది, మావుళ్లమ్మ దేవస్థానం ఈవోలకు ఆయన మెమో పంపారు. ఈనెల 9న విశాఖ శారదాపీఠం మేనేజర్‌ లేఖ రాసిన నేపథ్యంలో దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆయా దేవాలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని