AP News: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన

తాజా వార్తలు

Updated : 17/07/2021 13:31 IST

AP News: ఏపీలో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టులను ప్రకటించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.

ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. పదవులేవీ అలంకారప్రాయం కాదని అన్నారు. ఈ ప్రక్రియలో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 76 పదవులు కేటాయించామన్నారు. వెనుకబడిన తరగతులకు 56 శాతం పదవులు కేటాయించినట్లు వివరించారు. నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు.

పౌర సరఫరాల కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, వీఎంఆర్డీఏ ఛైర్‌ పర్సన్‌గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్‌ ఛైర్‌పర్సన్‌గా గాదల బంగారమ్మ, గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా రెడ్డి పద్మావతి, మారిటైం బోర్టు ఛైర్మన్‌గా విజయనగరం జిల్లాకు చెందిన కాయల వెంకట్‌రెడ్డి, టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్‌, డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా అడపా శేషగిరి, ఏపీ గ్రీనింగ్‌ బ్యూటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్‌.రామారావు, ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు, తిరుపతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధి కార్పొరేషన్‌ ఛైర్‌పర్స్‌న్‌గా నరమల్లి పద్మజ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నసీర్‌ అహ్మద్‌, బ్రహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా సుధాకర్‌, ‌ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని