రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు

తాజా వార్తలు

Published : 29/05/2021 08:55 IST

రహస్య ప్రాంతానికి ఆనందయ్య తరలింపు

నెల్లూరు: కరోనాకు మందును పంపిణీ చేసిన ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ తెల్లవారుజామున ప్రత్యేక పోలీసు బందోబస్తుతో ఆయన్ను తరలించారు. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న జనం కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. ఈ నెల 21నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. 

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీపై ఉత్కంఠ కొనసాగుతోంది. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఔషధంపై సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయన్ను రహస్య ప్రాంతంలోనే ఉంచనున్నట్టు సమాచారం. నెల్లూరు, ముత్తుకూరు నుంచి కృష్ణపట్నం వచ్చే రహదారుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారినీ అనుమతించడంలేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని