AP:మధ్యాహ్నం 12గంటల తర్వాత అన్నీ బంద్‌
close

తాజా వార్తలు

Updated : 04/05/2021 19:02 IST

AP:మధ్యాహ్నం 12గంటల తర్వాత అన్నీ బంద్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి నిబంధనలను కఠినంగా అమలు చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం నుంచి మధ్యాహ్నం 12గంటల తర్వాత పూర్తిస్థాయి కర్ఫ్యూ అమలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ మంగళవారం జరిగింది. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీలో కర్ఫ్యూ సహా, పలు అంశాలను చర్చించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రజా రవాణాతో పాటు, ప్రైవేటు వాహనాలు తిరగడానికి వీల్లేదని మంత్రి పేర్ని నాని తెలిపారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత అంతర్రాష్ట్ర, దూర ప్రాంత బస్సులు పూర్తి నిలిపివేస్తున్నట్లు మంత్రి వెల్లడించా మరోవైపు మద్యం అమ్మకాల వేళలు కుదించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే మద్యం దుకాణాలు ఉంటాయని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే!

* కడప స్టీల్‌ ప్లాంట్‌ను ఎస్సార్‌ స్టీల్స్‌కు అప్పగించాలని కేబినెట్‌ నిర్ణయం 

* కృష్ణపట్నం పోర్టులో మౌలిక వసతులకు రూ.1448 కోట్లు మంజూరుకు పచ్చజెండా 

కైలాసగిరి- భోగాపురం మధ్య ఆరు లైన్ల రోడ్డు వేయడంతో పాటు ఐదెకరాల్లో స్కైటవర్స్ నిర్మాణం‌, 11 బీచ్‌ల అభివృద్ధికి ఆమోద ముద్ర

* పల్నాడు కరవు నివారణకు రూ.2740 కోట్లు రుణం తీసుకొనేందుకు ఆమోదం 

* బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ, సహా ప్రైవేటు వాహనాల రాకపోకలపై నిషేధం. అంతర్రాష్ట్ర సర్వీసులతో పాటు, దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాల సేవలు కూడా రద్దు.

* ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్‌ రప్పించేందుకు చర్యలు.

* బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పెంపు.

* ఈనెల 13న రైతు భరోసా తొలి విడత జమ. 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4వేల 40 కోట్లు జమ. మే 25న 38లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,805 కోట్లు జమ.

* వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కింద కుటుంబానికి రూ.10వేలు పరిహారం. 2021 మే 18న మరో 1లక్షా 460మందికి అందజేత.

* రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ జమ చేశాం. గత ప్రభుత్వ బకాయిలు పెట్టిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా అందజేత.

* ప్రభుత్వ పాఠశాలల్లో 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ ద్వారా విద్యా బోధన. 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ విధానంలో చదువుకుని, పరీక్ష రాస్తారు. రాష్ట్రంలోని 44,639 ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విధానం అమలు.

* 2018-19 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 52,23,000 విద్యార్థులు ఉంటే, 2020-21 సంవత్సరానికి ఆ సంఖ్య 59,30,000 చేరింది.

* నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

* ఏపీలో మూసేసిన సహకార డెయిరీలను అమూల్‌కు లీజుకిస్తున్నాం. మొత్తం 708 గ్రామాల్లో అమూల్‌ సేవలు

* అర్చకులకు రూ.10వేల నుంచి రూ.15వేల గౌరవ వేతనం పెంపు. బి కేటగిరి ఆలయాల్లో రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం

* ఇమామ్‌లకు రూ.5వేల నుంచి రూ.10వేల గౌరవ వేతనం పెంపు. మౌజమ్‌లకు రూ.3వేల నుంచి రూ.5వేల గౌరవ వేతనం

* 45ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతే 18-44ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయం.

* పోలవరం ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీ నుంచి నీళ్లు తోడేందుకు లిఫ్ట నిర్మాణం. హంద్రనీవా ఫేజ్‌-1, ఫేజ్‌-2 పనులకు నిధులు మంజూరు

* ప్రైవేటు వర్సిటీ చట్టం మారుస్తూ మంత్రివర్గ నిర్ణయం. ప్రైవేటు వర్సిటీల్లో 35శాతం సీట్లు ప్రభుత్వానికి కేటాయించేలా చట్టంలో మార్పు.

* ఎయిడెడ్‌ కాలేజీలను ప్రభుత్వానికి అప్పగించాలని ప్రతిపాదన, లేదంటే పూర్తిగా ప్రైవేటు గా నిర్వహించుకోవాలని


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని