Corona: తెలంగాణలోకి ఏపీ అంబులెన్స్‌లు
close

తాజా వార్తలు

Updated : 15/05/2021 11:51 IST

Corona: తెలంగాణలోకి ఏపీ అంబులెన్స్‌లు

హైద‌రాబాద్‌:  ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్‌ల‌ను తెలంగాణ‌లోకి అనుమ‌తిస్తున్నారు. రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో అంబులెన్స్‌ల‌ను అడ్డుకోవ‌ద్ద‌ని తెలంగాణ ఉన్న‌త న్యాయ‌స్థానం ఆదేశాలు ఇవ్వ‌డంతో అంబులెన్స్‌ల‌కు అడ్డంకులు తొల‌గిపోయాయి. ముంద‌స్తు అనుమ‌తులు లేని అంబులెన్స్‌ల‌ను శుక్ర‌వారం రాత్రి వ‌ర‌కూ వ‌ద‌ల‌ని తెలంగాణ‌ పోలీసులు హైకోర్టు ఆదేశాల‌తో.. రాత్రి 10 గంటల నుంచి అనుమతిస్తున్నారు.

క‌ర్నూలు స‌మీపంలోని పుల్లూరు టోల్‌గేట్‌తో పాటు ఇత‌ర స‌రిహ‌ద్దుల వ‌ద్ద అంబులెన్స్‌ల‌కు నిన్న‌ పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌ని విష‌యం తెలిసిందే. దీంతో అత్య‌వ‌స‌ర వైద్యం అవ‌స‌ర‌మైన బాధితులు తీవ్ర ఇబ్బందులు ప‌డ్డారు. హైకోర్టు ఆదేశాల‌తో ప్ర‌స్తుతం పాసులు లేకున్నా కొవిడ్ బాధితుల వివ‌రాలు నమోదు చేసుకొని అంబులెన్స్‌ల‌ను పంపిస్తున్నారు. నిన్న పుల్లూరు వద్ద కడప, నంద్యాలకు చెందిన ఇద్దరు రోగులు చనిపోయారంటూ ప్రచారం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని