104 వ్యవస్థ బలోపేతం కావాలి: జగన్‌

తాజా వార్తలు

Updated : 10/05/2021 14:44 IST

104 వ్యవస్థ బలోపేతం కావాలి: జగన్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం మాక్‌ కాల్స్‌ చేసి పనితీరు పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ ప్రత్యేక అధికారులతో ఆయన ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు ఆదేశాలు, సూచనలు చేశారు. 104 నంబర్‌కు కాల్‌ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని.. అవసరమైన వారికి బెడ్‌ కేటాయించేలా చూడాలని స్పష్టం చేశారు. కొవిడ్‌ బాధితుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పడకలను గణనీయంగా పెంచాలని సూచించారు.  బెడ్‌ అవసరం లేదంటే కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు పంపించాలన్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

అన్నీ తెలిసినా కొందరు దుష్ప్రచారం..

వ్యాక్సినేషన్‌ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని.. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని జగన్‌ అన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్ర పరిధిలోనిది కాదని అందరికీ  తెలుసని.. అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. నెలకు 19లక్షలకు పైగా డోసులే వస్తున్నాయని చెప్పారు. వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్‌ టెండర్‌కు వెళ్లడంపై ఆలోచించాలని.. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాలి సీఎం సూచించారు.

రెమ్‌డెసివిర్‌పై ఆడిటింగ్‌ ఉండాలి

వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదని సీఎం ఆదేశించారు. టీకాలు ఎవరికి వేస్తారనేది ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు  ప్రజలకు చెప్పాలన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్‌ అందేలా చూడాలని జగన్‌ చెప్పారు. పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలించకుండా చూడాలని.. వాటి వినియోగంపై ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆడిటింగ్‌ ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని