AP News: బ్లాక్ మార్కెట్‌పై చ‌ర్య‌లేవి: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 03/06/2021 15:58 IST

AP News: బ్లాక్ మార్కెట్‌పై చ‌ర్య‌లేవి: హైకోర్టు

అమ‌రావ‌తి: రాష్ట్రంలో బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల బ్లాక్ మార్కెట్‌పై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ప్ర‌శ్నించింది. రాష్ట్రంలో క‌రోనా కేసులు, చికిత్స‌, ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల కొర‌త‌, అధిక ధ‌ర‌ల‌కు అమ్మ‌కాలు జ‌రుగుతుంటే ఏం చేస్తున్నారని నిల‌దీసింది. బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకునేందుకు ఇప్ప‌టికే ఫ్ల‌యింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌భుత్వం ధ‌ర్మాసనానికి వివ‌రించింది. కేంద్రం నుంచి స‌రిప‌డా ఇంజెక్ష‌న్లు రావ‌డం లేద‌ని.. 1400 మంది బ్లాక్ ఫంగ‌స్ రోగులు ఉంటే 13 వేల ఇంజ‌క్ష‌న్లే వ‌చ్చాయ‌ని తెలిపింది. ఒక్కో బ్లాక్ ఫంగ‌స్ బాధితుడికి రోజుకు మూడు ఇంజెక్ష‌న్ల చొప్పున 15 రోజులు ఇవ్వాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. మొత్తం 50 వేల ఇంజెక్ష‌న్ల అవ‌సరం ఉంద‌ని.. ఈ మేర‌కు ప్రైవేటుగా కొనుగోలు చేసేందుకు  సిద్ధ‌మ‌యిన‌ట్లు ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. 

రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేగ‌వంతం చేయాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 1.40 కోట్ల మందికి టీకాలు వేసిన‌ట్లు ప్ర‌భుత్వం హైకోర్టుకు వివ‌రించింది. దుకాణాల, బ్యాంకుల వ‌ద్ద ఏర్ప‌డుతున్న ర‌ద్దీపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. మూడో ద‌శ క‌రోనా వైర‌స్ స‌న్న‌ద్ధ‌త‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన హైకోర్టు.. మందులు, ప‌డ‌క‌ల కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశించింది. 

అవ‌స‌రాల‌కు స‌రిప‌డా బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్లు ఎందుకు స‌ర‌ఫ‌రా చేయ‌లేక‌పోయార‌ని.. ఏ ప్రాతిప‌దిక‌న వాటిని రాష్ట్రాల‌కు అందిస్తున్నారో చెప్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బ్లాక్ ఫంగ‌స్ ఇంజెక్ష‌న్ల కొర‌త ఉన్న‌ట్లు కేంద్రం త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా కొవిడ్ క‌మిటీల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌కు స్థానం క‌ల్పించాల‌ని పిటిష‌న‌ర్ కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌తో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాల‌ని హైకోర్టు వెల్ల‌డించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను న్యాయ‌స్థానం రేప‌టికి వాయిదా వేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని