హైదరాబాద్‌ వెళ్లేవారికి ఏపీ పోలీసుల సూచనలు

తాజా వార్తలు

Updated : 10/05/2021 15:36 IST

హైదరాబాద్‌ వెళ్లేవారికి ఏపీ పోలీసుల సూచనలు

అమరావతి: వైద్య చికిత్సలకు హైదరాబాద్‌ వెళ్లే వారికి ఏపీ పోలీసులు పలు సూచనలు చేశారు. ప్రైవేట్‌ అంబులెన్స్‌లలో వచ్చేవారికి షరతులతో అనుమతులు జారీ చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అలా వీలు కానిపక్షంలో రోగికి చికిత్స చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని..  సదరు వ్యక్తికి తమ ఆస్పత్రిలో పడక సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్‌కు చెందిన ఆస్పత్రి యాజమాన్యం నుంచి ముందస్తు అంగీకార పత్రాన్ని తీసుకోవాలని సూచించారు. అలాంటి వారికి తెలంగాణలోకి అనుమతి ఉంటుందన్నారు.

ఏపీ నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న కొవిడ్‌ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు ఈ ఉదయం నుంచి అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్‌ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. కొవిడ్‌ రోగులతో వెళ్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు తాజాగా ఈ సూచనలు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని