AP NEWS: మంత్రి చెప్పారనే అలా చేశాం..!

తాజా వార్తలు

Published : 16/06/2021 16:07 IST

AP NEWS: మంత్రి చెప్పారనే అలా చేశాం..!

సింహాచలం: విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్నను తెదేపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు దర్శించుకున్నారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తొలిసారి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

స్వామి వారి దర్శనం అనంతరం అశోక్‌ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచి ఆలయ మర్యాదలతో స్వామివారిని దర్శించుకుంటున్నామని, నేడు కనీస మర్యాదలు కూడా  పాటించలేదన్నారు. సాధారణ భక్తులవలే దర్శనం చేసుకోవాల్సి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఈవిషయమై అశోక్‌గజపతిరాజు ఆలయ అధికారులను ప్రశ్నించగా.. మంత్రి చెప్పారని, అందుకే పూర్ణకుంభంతో స్వాగతం పలకలేదని సమాధానమిచ్చారని తెలిపారు.

మాన్సాస్‌, సింహాచ‌లం ట్రస్టుల ఛైర్‌పర్సన్‌ నియామక జీవోను ఏపీ హైకోర్టు ఇటీవల కొట్టేసింది. సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ర‌ద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్రస్ట్‌  ఛైర్మన్‌గా పునర్నియమించాలని ఉన్నత న్యాయ‌స్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని