ఏపీలో స్తంభించిన రవాణా

తాజా వార్తలు

Updated : 26/03/2021 11:47 IST

ఏపీలో స్తంభించిన రవాణా

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతుల పిలుపుమేరకు శుక్రవారం భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, వైకాపా, తెదేపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, వామపక్షాలు బంద్‌కు మద్దతివ్వడంతో ఆంధ్రప్రదేశ్‌లో బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జనసంచారం లేక ఆర్టీసీ బస్టాండ్లు వెలవెలబోతున్నాయి. ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ  స్తంభించింది. ప్రైవేటు పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి.

విశాఖలో ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు నినాదాలు చేశాయి. మద్దిలపాలెం బస్టాండ్‌ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. గుంటూరు, కర్నూలు, అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ల వద్ద వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 డిపోల్లోని 1200 బస్సులు ఆగిపోయాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా తిరుపతి-తిరుమల మధ్య బస్సు సర్వీసులు నడుపుతున్నారు. తిరుపతి బస్టాండ్‌, సుబ్బలక్ష్మి విగ్రహ కూడలిలో వామపక్ష నాయకులు, తెదేపా, కాంగ్రెస్‌ నేతలు నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చెన్నై, బెంగళూరుకు నడిపే అంతర్రాష్ట్ర సర్వీసులను నిలిపివేశారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని