AP News: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం.. అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు
close

తాజా వార్తలు

Updated : 22/07/2021 21:53 IST

AP News: మాన్సాస్‌ ట్రస్ట్‌ వ్యవహారం.. అశోక్‌ గజపతిరాజుపై కేసు నమోదు

విజయనగరం: కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్టు ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల ఈనెల 17న విద్యాసంస్థల ఉద్యోగులు మాన్సాస్‌ ఛైర్మన్‌ను కలిశారు. అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను నిలదీశారు. ఈక్రమంలో ఈవో, ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి..  కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరిపించారనే ఆరోపణలతో అశోక్‌గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైర్మన్‌, కరస్పాండెంట్‌ సహా 10మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని