వివేకా హత్యకేసు.. ఇదయతుల్లాను ప్రశ్నిస్తున్న సీబీఐ

తాజా వార్తలు

Updated : 09/06/2021 12:26 IST

వివేకా హత్యకేసు.. ఇదయతుల్లాను ప్రశ్నిస్తున్న సీబీఐ

క‌డ‌ప‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో మూడో రోజు సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. వివేకా ఇంట్లో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌గా పని చేసిన ఇద‌య‌తుల్లాతో పాటు పులివెందుల‌కు చెందిన వైకాపా కార్య‌క‌ర్త‌ కిర‌ణ్ కుమార్ యాద‌వ్‌ల‌ను సీబీఐ అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నిన్న ఇద‌య‌తుల్లాను 7 గంట‌ల పాటు ప్ర‌శ్నించిన అధికారులు.. ఇవాళ మ‌రోసారి అతడిని విచార‌ణ‌కు పిలిచారు. క‌డ‌ప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో ఈ విచార‌ణ జ‌రుగుతోంది. నిన్న‌ ఇద‌య‌తుల్లాతో పాటు వివేకా కారు మాజీ డ్రైవ‌ర్ ద‌స్త‌గిరిని కూడా అధికారులు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. 

2019 మార్చిలో వివేకా హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో ఆయ‌న మృత‌దేహాన్ని తొలుత ఇద‌య‌తుల్లా త‌న ఫోన్‌లో ఫొటోలు తీసిన‌ట్లు అధికారుల వ‌ద్ద ప్రాథ‌మిక స‌మాచారం ఉంది. ఈ నేప‌థ్యంలో హ‌త్య జ‌రిగినప్పుడు ఇంట్లో ఎవ‌రెవ‌రు ఉన్నారు?  బాత్‌రూమ్ నుంచి వివేకా మృత‌దేహాన్ని బెడ్‌రూమ్‌లోకి ఎవ‌రు త‌ర‌లించార‌నే త‌దిత‌ర విష‌యాల‌పై అధికారులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని