అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం

తాజా వార్తలు

Updated : 09/07/2021 15:18 IST

అమర జవాను కుటుంబానికి రూ.50 లక్షల సాయం

కడప: గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన యువ సైనికుడు జశ్వంత్‌రెడ్డి(23) వీరమరణం పొందడంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. జమ్ముకశ్మీర్‌లోని సుందర్‌బాని సెక్టార్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో జశ్వంత్‌రెడ్డి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్‌ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు.

కడప జిల్లాలో వరుసగా రెండో రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడూ నిండుకుండలా ఉండాలని ఆకాంక్షించారు. కుందూ నదిపై లిఫ్ట్‌ ద్వారా బ్రహ్మం సాగర్‌కు నీళ్లు తరలిస్తామన్నారు. బద్వేలులో సుమారు రూ.500కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. బద్వేలు నియోజవకవర్గం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానన్నారు. నియోజకవర్గ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. కడప-పోరుమామిళ్ల రహదారిలో 4 వరుసల రహదారికి సీఎం శంకుస్థాపన చేశారు. బ్రహ్మణపల్లి సమీపంలో సగిలేరుపై మరోవంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బద్వేలులో నూతన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని