Coronavaccine: దర్శిలో స్వల్ప తోపులాట

తాజా వార్తలు

Published : 24/05/2021 12:15 IST

Coronavaccine: దర్శిలో స్వల్ప తోపులాట

దర్శి: ప్రకాశం జిల్లా దర్శిలో వ్యాక్సిన్‌ కోసం భారీగా ప్రజలు తరలి వచ్చారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండో డోసు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు భారీగా ప్రజలు తరలి రావడంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. మండల వ్యాప్తంగా రెండో డోసు వేయించుకునే వారి సంఖ్య దాదాపు 1000కి పైగా ఉండగా కేవలం 300 మందికి మాత్రమే టీకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో తమకు దొరకదేమోనని ప్రజలు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాలు, ఇతర మండలాల నుంచి అధిక సంఖ్యలో వ్యాక్సిన్‌ పంపిణీ కేంద్రానికి రావడంతో అక్కడ స్వల్ప తోపులాట జరిగింది. పోలీసులు కలుగజేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని అందరికీ సక్రమంగా టీకాలు అందేలా చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 

పెనమలూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు

కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో మొదటి డోసు టీకా వ్యాక్సిన్ కోసం 45 ఏళ్లు పైబడిన వారు బారులు తీరారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెనమలూరుతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పెనమలూరు-చోడవరం ఆర్‌ఎండ్‌బీ రహదారిలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేయడంతో పోలీసులు వాటిని పక్కకు తొలగించారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వారిలో కొందరు గుర్తింపు కార్డులు తెచ్చుకోకపోవటంతో నిరాశగా వెనుదిరిగారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ రెండు రోజుల పాటు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని