Vizag: డాక్టర్‌ సుధాకర్‌ గుండెపోటుతో మృతి

తాజా వార్తలు

Updated : 22/05/2021 06:15 IST

Vizag: డాక్టర్‌ సుధాకర్‌ గుండెపోటుతో మృతి

ఈనాడు, విశాఖపట్నం: ఆసుపత్రిలో గ్లౌజ్‌లు, మాస్కులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని గతంలో ఆరోపణలు చేసిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి మత్తు వైద్య నిపుణుడు సుధాకర్‌(52) శుక్రవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన్ను విధుల నుంచి సస్పెండ్‌ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విధుల్లోకి తీసుకోలేదు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని కొద్ది రోజులు విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. బాధిత కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. త్వరలో న్యాయస్థానం నుంచి తీర్పు రావాల్సి ఉంది. విధుల్లోకి తిరిగి తీసుకోకపోవడం వల్ల సుధాకర్‌ తీవ్ర మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విశాఖ నగరం సీతమ్మధారలోని స్వగృహంలోనే మృతిచెందగా, దహన సంస్కారాలు పూర్తయినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని