Eluru Election: ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం

తాజా వార్తలు

Published : 25/07/2021 08:30 IST

Eluru Election: ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలోని 4 కేంద్రాల్లో లెక్కింపు చేపడుతున్నారు. ఒక్కో డివిజన్‌కు ఒక్కో లెక్కింపు టేబుల్‌ కేటాయించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను రికార్డు చేసేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 250 మంది సిబ్బందిని నియమించారు. ఈ ప్రక్రియ పర్యవేక్షణకు డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి, పురపాలక అధికారిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది.

మార్చి 10న ఎన్నికల పోలింగ్‌ జరిగినా.. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో లెక్కింపును ఉన్నత న్యాయస్థానం నిలిపేసింది. ఇటీవల ఓట్ల లెక్కింపుకు హైకోర్టు అనుమతించడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏలూరు కార్పొషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉండగా అందులో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 47 డివిజన్లకే ఎన్నికలు నిర్వహించారు. వైకాపా 47, తెదేపా 43, జనసేన 19, భాజపా 14 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశముంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని