కనిపెట్టారు.. ప్రాణాలు నిలబెట్టారు..
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 07:02 IST

కనిపెట్టారు.. ప్రాణాలు నిలబెట్టారు..

మార్గమధ్యలో కనిపించకుండా పోయిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌
ఎట్టకేలకు గుర్తించి.. గ్రీన్‌ఛానల్‌లో విజయవాడకు చేరవేత

ఈనాడు, అమరావతి, ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: విజయవాడ జీజీహెచ్‌లో 450 మంది కరోనా రోగులు ప్రాణవాయువు ఆధారంగా చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ఆక్సిజన్‌ నిల్వలు శుక్రవారం ఉదయం 10గంటల వరకే సరిపోతాయి. ఒడిశా నుంచి జీజీహెచ్‌కు రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆచూకీ మాయమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఎట్టకేలకు ట్యాంకర్‌ ఆచూకీ కనుగొన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బి.శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని భువనేశ్వర్‌ ప్రాంతం నుంచి జీజీహెచ్‌కు 18 టన్నుల ప్రాణవాయువు ట్యాంకర్‌ గురువారం ఉదయం బయలుదేరింది. అర్ధరాత్రికి విజయవాడకు చేరుకోవాల్సి ఉంది. కానీ అధికారులు జీపీఎస్‌ ట్రాక్‌ చేస్తే ట్యాంకర్‌ కనిపించలేదు. దీంతో విజయవాడ పోలీసులు కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖ తదితర జిల్లాల పోలీసులను అప్రమత్తం చేశారు. భువనేశ్వర్‌ నుంచి ట్యాంకర్‌ను నడుపుకుంటూ వస్తున్న బిహార్‌కు చెందిన డ్రైవర్‌ దినేష్‌ అలసిపోయి.. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం చేరుకున్నాక దాబా వద్ద వాహనాన్ని నిలిపేశాడు. సీఐ రాంబాబు, ఎస్‌ఐ సుధాకర్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది దాబా వద్ద గురువారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటలకు ట్యాంకర్‌ను గుర్తించారు. ట్యాంకరును నడపలేని స్థితిలో చోదకుడు ఉన్నాడు. దీంతో ప్రత్తిపాడు హైవే పెట్రోలింగ్‌లో పనిచేస్తున్న హోంగార్డు కె.సత్యనారాయణ 230 కిలోమీటర్లు ట్యాంకర్‌ను నడుపుకుంటూ విజయవాడ చేర్చారు. పోలీసులు గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని