AP News: బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే అరెస్టు 

తాజా వార్తలు

Updated : 24/05/2021 09:45 IST

AP News: బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే అరెస్టు 

అరెస్టుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన చంద్ర‌బాబు

బ‌న‌గాన‌ప‌ల్లె: క‌ర్నూలు జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లె మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత‌ బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి అరెస్ట్ అయ్యారు. నిన్న రాత్రి తెదేపా, వైకాపా వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు జ‌నార్ధ‌న్‌రెడ్డిపై కేసు న‌మోదు చేశారు. అర్ధ‌రాత్రి పోలీసులు ఈయ‌న‌ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను బ‌న‌గాన‌ప‌ల్లె నుంచి డోన్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. జ‌నార్ధ‌ర్‌రెడ్డిని ఇవాళ ఆళ్ల‌గ‌డ్డ కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌నున్నారు. 

అధికారం శాశ్వ‌తం కాదు: చంద్ర‌బాబు

తెదేపా నేత అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఖండించారు. "క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై అక్ర‌మ కేసులే ల‌క్ష్యంగా పాల‌న సాగిస్తున్నారు. బీసీ జ‌నార్ధ‌న్‌రెడ్డి, ఇతర నేతల అక్ర‌మ అరెస్టుల‌ను ఖండిస్తున్నా. అధికారం శాశ్వ‌తం కాద‌నే విష‌యాన్ని జ‌గ‌న్ తెలుసుకోవాలి. వైకాపా పాల‌న మూడు అక్ర‌మ కేసులు, 6 అరాచ‌కాలు అన్న‌ట్లుగా సాగుతోంది. దాడికి పాల్ప‌డిన వైకాపా నేత‌ల‌ను వ‌దిలిపెట్టి జ‌నార్ధ‌న్‌రెడ్డిపై కేసు పెడ‌తారా.?  తెదేపా నేత‌ల‌పై అక్ర‌మ కేసులు ఎత్తివేసి వెంట‌నే విడుద‌ల చేయాలి"  అని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని