ఉత్తర కోస్తాలో వానలు.. దక్షిణ కోస్తాలో ఎండలు

తాజా వార్తలు

Updated : 09/06/2021 05:32 IST

ఉత్తర కోస్తాలో వానలు.. దక్షిణ కోస్తాలో ఎండలు

ఈనాడు, అమరావతి: ఉత్తర కోస్తాలో వానలు కురవగా.. దక్షిణ కోస్తాలో ఎండలు మండాయి. గుంటూరు, కృష్ణా, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలకు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ స్టెల్లా తెలిపారు. బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవొచ్చని సూచించారు. 11న ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని