ప్రభుత్వం స్పందించకుంటే నిర్ణయం ప్రకటిస్తా: ఆనందయ్య

తాజా వార్తలు

Updated : 10/06/2021 13:02 IST

ప్రభుత్వం స్పందించకుంటే నిర్ణయం ప్రకటిస్తా: ఆనందయ్య

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని సీఎంకు ఇటీవల లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం ప్రకటించలేదని బుధవారం ఆయన ‘ఈనాడు’కు తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం స్పందించకుంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎలా పంపాలనే విషయాన్ని తమ బృందంతో గురువారం చర్చిస్తానన్నారు. ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామన్నారు. తమ గ్రామంలో అందరికీ ఇప్పటికే పంపిణీ చేశామని, సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు. 50 వేల మంది పాజిటివ్‌ వ్యక్తులకు ఇచ్చేందుకు మందు సిద్ధంగా ఉందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని