AP News: వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌
close

తాజా వార్తలు

Published : 10/06/2021 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌

హైకోర్టులో మెమో దాఖలు చేసిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 26,325 మంది వైద్య, ఇతర సిబ్బందిని నియమించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, వ్యాక్సినేషన్‌ అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు వివరాలను ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. పీజీ మెడికల్‌ విద్యార్థుల సేవలకు భవిష్యత్‌లో వెయిటేజీ ఇస్తామంది. ఇప్పటి వరకు 1955 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు, 109 మరణాలు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సుమారు 1300 బ్లాక్‌ఫంగస్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. 

థర్డ్‌వేవ్‌లో పిల్లలకు కరోనా వస్తుందని నిర్ధారణ కాలేదని.. అయినప్పటికీ ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వృద్ధులకు ఆధార్‌ లేకుండానే వ్యాక్సిన్‌ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు వ్యాక్సినేషన్‌పై ‘ఈనాడు’ ప్రచురించిన వార్తను అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం దీనిపై మెమో దాఖలు చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని