అత్యాచార బాధితురాలిని గంటకుపైగా విచారించిన పోలీసులు

తాజా వార్తలు

Updated : 26/06/2021 13:17 IST

అత్యాచార బాధితురాలిని గంటకుపైగా విచారించిన పోలీసులు

ఈనాడు, అమరావతి: తాడేపల్లి అత్యాచార ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. బాధిత యువతిని గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు శుక్రవారం తాడేపల్లి స్టేషన్‌లో విచారించారు. గంటకు పైగా సాగిన విచారణలో పలువురు మహిళా పోలీసు అధికారులు ఆమెతో మాట్లాడారు. ఈ కేసులో 20 మందికి పైగా అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. వారందరినీ బాధితురాలి ఎదుట ప్రవేశపెట్టినట్లు సమాచారం. ఈ సమయంలో యువతి వెంట కుటుంబీకులు ఉన్నారు. విచారణ అనంతరం ఆమెను పోలీసు వాహనంలో ఇంటికి తీసుకెళ్లి కుటుంబీకులకు అప్పగించారు. కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు కృష్ణా కెనాల్‌ జంక్షన్‌, సీతానగరం పుష్కరఘాట్‌, రైల్వేట్రాకుల  వెంట ముమ్మరంగా గాలిస్తున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని