స్వచ్ఛ రక్షకుడు!

తాజా వార్తలు

Updated : 23/09/2021 04:45 IST

స్వచ్ఛ రక్షకుడు!

నేను.. నా ఇల్లు.. నా సమాజం.. నా దేశం.. ప్రతి చోట పరిశుభ్రత పాటించాలని అందరూ సంకల్పిస్తే... స్వచ్ఛభారత్‌ లక్ష్యం నెరవేరుతుంది. అలా స్వచ్ఛ సంకల్పంతో పని చేస్తున్నారు.. రక్షణశాఖ ఉద్యోగి ఆదినారాయణ. ప్రస్తుతం విశాఖపట్నం ఐ.ఎన్‌.ఎస్‌.డేగాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 14 రాష్ట్రాల్లో పని చేశారు. ఎక్కడ పని చేసినా... రక్షణ విధులు ముగిసిన తర్వాత, అవే దుస్తులు వేసుకుని ఆయా నగర వీధుల్లో చెత్త ఏరుతుంటారు. విశాఖలోని ఎన్‌ఏడీ కూడలి పైవంతెనపై చెత్త ఏరుతూ కనిపించారు. ఆయన్ను పలకరిస్తే.. ‘28 ఏళ్లుగా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నాను. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఈ పనులు కొనసాగిస్తా’ అంటున్నారు.

-ఈనాడు, విశాఖపట్నం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని