Ap News: జూడాలతో చర్చలు సఫలం
close

తాజా వార్తలు

Published : 09/06/2021 16:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ap News: జూడాలతో చర్చలు సఫలం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో జూనియర్‌ వైద్యుల (జూడాలు) చర్చలు సఫలమయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్‌ వైద్యులు ప్రకటించారు. జూడాలతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో జూడాలు సమ్మెను విరమించారు. 

చర్చల అనంతరం జూనియర్‌ వైద్యుల సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక భరోసా కల్పి్స్తామని హామీ ఇచ్చారు. 15 శాతం మేర స్టైఫండ్‌ పెంచాలని ప్రభుత్వాన్ని కోరగా.. మరింత ఎక్కువే స్టైఫండ్‌ పెంచే ఆలోచన ఉందని చెప్పారు. కొవిడ్‌ బారిన పడిన వైద్యులకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరాం. దీనిపై స్పందిస్తూ.. సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందిస్తామన్నారు. మేం ప్రస్తావించిన అంశాలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు’’ అని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని