Raghurama: సీఐడీ అద‌న‌పు డీజీకి లీగ‌ల్ నోటీసు

తాజా వార్తలు

Updated : 05/06/2021 10:56 IST

Raghurama: సీఐడీ అద‌న‌పు డీజీకి లీగ‌ల్ నోటీసు

అమ‌రావ‌తి: ఏపీ సీఐడీ అద‌న‌పు డీజీకి ఎంపీ ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది లీగ‌ల్ నోటీసు పంపించారు. ర‌ఘురామ‌ను అరెస్టు చేసే స‌మ‌యంలో తీసుకున్న వ‌స్తువుల‌ను మెజిస్ట్రేట్ వ‌ద్ద జ‌మ చేయాల‌ని మంగ‌ళ‌గిరి సీఐడీ ఎస్‌హెచ్‌వోకు నోటీసు పంపారు. ఎంపీని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి మొబైల్ ఫోన్ తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. అందులో విలువైన స‌మాచారం ఉంద‌ని ర‌ఘురామ త‌ర‌ఫు న్యాయ‌వాది నోటీసులో వివ‌రించారు. ఇత‌ర అంశాల‌తో పాటు మొబైల్ కోడ్ ఓపెన్ చేయాల‌ని ఎంపీని క‌స్ట‌డీలో హింసించార‌ని న్యాయ‌వాది పేర్కొన్నారు. 

ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠ‌కు భంగం క‌లిగించేలా వ్యాఖ్య‌లు చేశార‌ని గ‌త నెల న‌ర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ‌రాజును ఏపీ సీఐడీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్టు చేశారు. గుంటూరు తీసుకెళ్లి పోలీసులు క‌స్ట‌డిలో విచారించారు. ఎంపీ హైకోర్టులో బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. మంజూరు కాక‌పోవ‌డంతో సుప్రీంను ఆశ్ర‌యించారు. అక్క‌డ ఆయ‌న‌కు ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరైంది. అంత‌క‌ముందు..  క‌స్ట‌డీలో ఉండ‌గా త‌నను పోలీసులు కొట్టార‌ని ఎంపీ గుంటూరు జిల్లా న్యాయ‌మూర్తికి వివ‌రించ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు సైతం చేసి వైద్య బృందం నివేదిక కోర్టుకు అంద‌జేసిన విష‌యం తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని