AP News: ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం

తాజా వార్తలు

Updated : 25/06/2021 14:02 IST

AP News: ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం

దిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ సీఎస్‌ను హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దంటూ గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారంటూ తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్‌ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని