Ap News: ఏసీపీ శ్రీనివాసరావు జైలు శిక్ష నిలుపుదల
close

తాజా వార్తలు

Published : 22/07/2021 21:35 IST

Ap News: ఏసీపీ శ్రీనివాసరావు జైలు శిక్ష నిలుపుదల

అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విజయవాడ ఏసీపీగా పనిచేసిన కె.శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును వారం రోజుల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది. అయితే హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ శ్రీనివాసరావు డివిజన్ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన డివిజన్‌ బెంచ్‌ జైలుశిక్ష అమలును నిలుపుదల చేస్తూ తదుపరి విచారణ వాయిదా వేసింది. శ్రీనివాసరావు ప్రస్తుతం శ్రీకాకుళం ఎస్‌ఈబీ ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.

గతంలో విజయవాడ ఏసీపీగా పనిచేసిన కె.శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. ఏసీపీ కె.శ్రీనివాసరావుకు నాలుగు వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని