Ap News: హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

తాజా వార్తలు

Published : 23/09/2021 18:43 IST

Ap News: హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి రద్దు.. ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

అమరావతి: హైదరాబాద్ నుంచి తాత్కాలికంగా తరలివచ్చిన సచివాలయ, శాసన పరిషత్‌, హెచ్ఓడీ విభాగాలకు చెందిన మహిళా, పురుష ఉద్యోగులకు నవంబర్ 1వ తేదీ నుంచి ఉచిత వసతి సౌకర్యాన్ని నిలిపివేయాలని ఏపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం కల్పించిన తాత్కాలిక ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగులు నవంబర్ 1 నుంచి ఎవరి వసతి వారు సొంత ఖర్చులతో భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం 2021 ఆగస్టు నుంచి ఆక్టోబరు 31  వరకు మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. అక్టోబరు 31వ తేదీ తర్వాత ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ట్రాన్సిట్ వసతిని నిలిపివేయనున్నారు. సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకు షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది. 2021 నవంబరు 1 నుంచి ఉద్యోగులెవరికీ ఉచిత వసతి ఉండబోదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని