AP DGP: ఆ హెరాయిన్‌తో విజయవాడకు సంబంధం లేదు: డీజీపీ

తాజా వార్తలు

Published : 23/09/2021 18:14 IST

AP DGP: ఆ హెరాయిన్‌తో విజయవాడకు సంబంధం లేదు: డీజీపీ

విజయవాడ: గుజరాత్‌లో పట్టుబడిన హెరాయిన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. డీఆర్‌ఐ, నార్కోటెక్స్‌ కంట్రోల్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని చెప్పారు. విజయవాడ అడ్రస్‌ మాత్రమే వాడుకున్నారని, లావాదేవీలు మొత్తం చెన్నై కేంద్రంగా జరిపారని డీజీపీ వెల్లడించారు. సీఎం ఆఫీసు దగ్గరలోనే జరిగిందని అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించి, అభద్రతా భావంలోకి నెడుతున్నారని అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు డీజీపీ తెలిపారు. దర్యాప్తు బృందాలకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని