GRMB: ఆరు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి.. ఏపీ, తెలంగాణకు జీఆర్‌ఎంబీ ఆదేశాలు

తాజా వార్తలు

Published : 17/09/2021 15:48 IST

GRMB: ఆరు నెలల్లోగా అనుమతులు తెచ్చుకోవాలి.. ఏపీ, తెలంగాణకు జీఆర్‌ఎంబీ ఆదేశాలు

హైదరాబాద్‌: ప్రాజెక్టుల నిర్వహణకు వారం, పది రోజుల్లో సిబ్బంది వివరాలను ఇవ్వాలని ఇరు రాష్ట్రాల అధికారులను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) ఉప సంఘం కోరింది. అనుమతుల్లేని ప్రాజెక్టులకు ఆర్నేళ్లలోగా అనుమతులు తెచ్చుకోవాలని స్పష్టం చేసింది. జలసౌధలో జీఆర్‌ఎంబీ ఉపసంఘం ఇవాళ సమావేశమైంది.  తెలుగు రాష్ట్రాల అధికారులతో పాటు బోర్టు సభ్యులు ఈ భేటీలో పాల్గొన్నారు. అక్టోబర్‌ 14లోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుకు సహకరించాలని తెలుగు రాష్ట్రాలను కోరింది.

మరోవైపు ఆర్‌.కె.పిళ్లై కన్వీనర్‌గా జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. గెజిట్‌ అమలు కార్యచరణ ఖరారుపై అధికారులు చర్చిస్తున్నారు. కేఆర్‌ఎంబీ సభ్యులు, ఏపీ తెలంగాణ అంతర్రాష్ట్ర వ్యవహారాల సభ్యులు, రెండు రాష్ట్రాల జెన్‌ కో అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని