Cyclone Gulab: వాయుగుండంగా బలహీన పడిన గులాబ్‌ తుపాను

తాజా వార్తలు

Updated : 27/09/2021 16:50 IST

Cyclone Gulab: వాయుగుండంగా బలహీన పడిన గులాబ్‌ తుపాను

అమరావతి: కళింగపట్నం వద్ద తీరాన్ని దాటిన గులాబ్‌ తుపాను తీవ్రత తగ్గి వాయుగుండంగా బలహీన పడిందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌కు 65 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలానికి 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. రానున్న 24 గంటల్లో తుపాన్‌ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ స్పష్టం చేసింది. గడచిన 6 గంటలుగా ఇది గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ అరేబియా సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని అంచనా వేసింది. సెప్టెంబరు 30వ తేదీ నాటికి మహారాష్ట్ర-గుజరాత్‌కు సమీపంలో అరేబియా సముద్రంలోకి ప్రవేశించి మళ్లీ బలపడే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ, తెలంగాణల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా-ఒడిశా తీరప్రాంతాల్లో సముద్రం ఇంకా అలజడిగానే ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. విశాఖ, గజపతినగరం, నెల్లిమర్లలో అత్యధికంగా 28 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని