‘మఠం’ వివాదంపై 16న తీర్పు: హైకోర్టు

తాజా వార్తలు

Updated : 14/07/2021 17:25 IST

‘మఠం’ వివాదంపై 16న తీర్పు: హైకోర్టు

అమరావతి: కడప జిల్లాలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం పీఠాధిపతి వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. మఠానికి శాశ్వత, తాత్కాలిక మఠాధిపతులుగా తమను గుర్తించేలా దేవాదాయశాఖను ఆదేశించాలని కోరుతూ దివంగత మఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మి, ఆమె కుమారుడు ఎన్.గోవిందస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

మఠాధిపతి విషయంలో దేవాదాయశాఖ జోక్యం చేసుకుందని, తమను బలవంతంగా ఒప్పించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పీఠాధిపతి నియామకం విషయంలో దేవాదాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేసే అధికారం లేదన్నారు. మఠాధిపతి విషయంలో ధార్మిక పరిషత్ తీర్మానం చేసిందని.. అందుకు అనుగుణంగానే తాత్కాలిక మఠాధిపతిగా ప్రత్యేక అధికారిని నియమించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈనెల 16న తీర్పును వెల్లడిస్తామని తెలిపింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని