Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

తాజా వార్తలు

Updated : 03/08/2021 17:05 IST

Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్‌ వద్ద కృష్ణమ్మ పరవళ్లు

హైదరాబాద్: నాగార్జునసాగర్ జలాశయం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రస్తుతం 16 క్రస్ట్ గేట్లను 10 అడగుల మేర ఎత్తి 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో రెండు గేట్లను దించివేశారు. జలాశయానికి ఎగువ నుంచి 1,95,215 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది. జలాశయంలో దాదాపు పూర్తి స్థాయిలో నీటి నిల్వ ఉండడంతో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 33,860 క్యూసెక్కులు, సాగర్ ఎడమ కాల్వ ద్వారా 601 క్యూసెక్కులు, ఎమ్మార్పీ కాల్వ ద్వారా 1,800 క్యూసెక్కులు, లో లెవెల్ కాల్వ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకుగాను.. 586.90 అడగులు వరకు నీరు చేరింది. మొత్తం 312.04 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం జలాశయంలో 304.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని