SDG India Index 2020-21: ఎస్‌డీజీ ఇండెక్స్‌లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

తాజా వార్తలు

Updated : 13/08/2021 15:44 IST

SDG India Index 2020-21: ఎస్‌డీజీ ఇండెక్స్‌లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌

అమరావతి: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ పనితీరుపై సచివాలయంలో రెండో రోజు నీతి ఆయోగ్‌ సమీక్ష నిర్వహించింది. ఏపీ ఉన్నతాధికారులు, నీతి ఆయోగ్‌ సలహాదారు సమీక్షకు హాజరయ్యారు. మల్టీ డైమెన్షియల్‌ ఇండెక్స్‌ సంస్కరణల ప్రణాళికను రూపొందించుకోవాలని నీతి ఆయోగ్‌ ప్రభుత్వానికి సూచించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో సంస్కరణలు చాలా కీలకమని.. ఎంపీఐ ర్యాంకింగ్‌లో భారత్‌ 62వ స్థానంలో ఉందని తెలిపింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఏపీ 3వ స్థానంలో ఉందని.. త్వరలోనే అగ్రస్థానానికి చేరుకుంటామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది. ఈ మేరకు సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ బృందం ఎస్‌డీజీ ఇండియా ఇండెక్స్ 2020-2021 రిపోర్టును సీఎంకు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని