కత్తి మహేశ్‌ కారు ప్రమాదంపై విచారణ

తాజా వార్తలు

Published : 14/07/2021 17:49 IST

కత్తి మహేశ్‌ కారు ప్రమాదంపై విచారణ

నెల్లూరు: సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్‌ మృతిపై పలు ఆరోపణలు వస్తుండటంతో నెల్లూరు పోలీసులు కారు ప్రమాదంపై విచారణ చేపట్టారు. గత నెల 26న నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై కత్తి మహేశ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహేశ్‌ను నెల్లూరు నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నైకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తుండటంతో కోవూరు పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవింగ్‌ చేస్తున్న సురేష్‌ను నెల్లూరు పిలిపించిన పోలీసులు కోవూరు స్టేషన్‌లో విచారిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు తెన్నులపై సురేష్‌ ను సీఐ రామకృష్ణ విచారిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని