బస్సులో తరలిస్తున్న రూ.3.05కోట్లు స్వాధీనం
close

తాజా వార్తలు

Published : 10/04/2021 14:29 IST

బస్సులో తరలిస్తున్న రూ.3.05కోట్లు స్వాధీనం

కర్నూలు: కర్నూలు శివారు పంచలింగాల చెక్‌పోస్టు  వద్ద రూ.3.05కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సులో హైదరాబాద్‌ నుంచి బెంగళూరు తరలిస్తుండగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును పోలీసులు సీజ్‌ చేశారు. డబ్బు తరలిస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్‌ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని రామచంద్ర వైద్య కళాశాలకు చెందిన నగదుగా నిందితుడు చెప్పినట్టు  కర్నూలు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. మరో బస్సులో కిలో బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని