close
కౌలు రైతులకూ వడ్డీలేని రుణాలు

రైతులకు ఏడాదికి రూ.12,500 సాయం
వ్యవసాయానికి పగలే 9 గంటల ఉచిత విద్యుత్‌
పింఛన్‌ రూ.3 వేలకు పెంపు
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోకి నేడు తుదిరూపు..!

ఈనాడు, అమరావతి: విద్య, ఉపాధి, వైద్యం, వ్యవసాయం, జలయజ్ఞం.. పాదయాత్రలో ఇచ్చిన హామీలే ప్రధాన అజెండాగా వైకాపా ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ శుక్రవారం  హైదరాబాద్‌లో మేనిఫెస్టో కమిటీ సభ్యులతో భేటీ అయి  తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20లోపు ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 16న ఇడుపులపాయలో పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటనతోపాటే మేనిఫెస్టోనూ విడుదల చేయడంపైనా  చర్చ జరుగుతున్నా సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పరిశీలనలో ఉన్న ప్రధాన హామీల్లో కొన్ని రంగాల వారీగా..

విద్య: పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15,000 అందజేత, పూర్తి స్థాయిలో ఫీజు రీఎంబర్స్‌మెంట్‌
వైద్యం: రూ.1,000 వైద్యం ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపచేయడం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలో చికిత్స చేయించుకునేందుకు అవకాశమివ్వడం
* కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి రూ.10,000 చొప్పున పింఛను
సంక్షేమంలో: వృద్ధాప్య పింఛను అర్హత వయస్సు 65 నుంచి 60కి తగ్గింపు..పింఛను మొత్తం రూ.3,000లకు పెంపు
* 25లక్షల ఇళ్ల నిర్మాణం
* డ్వాక్రా సంఘాల మహిళల రుణమాఫీ
* 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ మహిళలకు ప్రభుత్వం ఏర్పాటైన రెండో ఏడాది నుంచి సంవత్సరానికి రూ.75,000 చొప్పున వైఎస్సార్‌ చేయూత కింద ఆయా కార్పొరేషన్ల ద్వారా ఉచిత సాయం
వ్యవసాయం: రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కూలీలు వలసలు పోని రాష్ట్రంగా..రైతు ఇంటికి తీసుకెళ్లగలిగే నికర ఆదాయం పెంచడమే లక్ష్యంగా వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యం..
* కౌలు రైతులకు వడ్డీలేని రుణాలివ్వడం
* వైఎస్సార్‌ రైతు భరోసా పేరుతో ప్రభుత్వం ఏర్పాటైన రెండో సంవత్సరం నుంచి ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున సాయం.
* పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌
* రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ
* రూ.4వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సమయంలో రైతులకు సాయమందించేందుకు నిధి ఏర్పాటు
* ఆక్వా రైతులకు యూనిట్‌ రూ.1.50కి ఇవ్వడం
* భూసారపరీక్షల కోసం మొబైల్‌ యూనిట్‌ 102, మొబైల్‌ పశు వైద్యశాలల ఏర్పాటు
జలయజ్ఞం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించిన జలయజ్ఞం ప్రాజెక్టుల్లో 80శాతం పనులు పూర్తయి పెండింగులో ఉన్నవాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడం.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.