close
రైతులకు రూ.5 వేల పింఛను

చిన్న, సన్నకారు, కౌలుదారులకు వర్తింపు
1 నుంచి పీజీ వరకు ఉచిత విద్య
రూ.10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా
శాసనసభలో మహిళలకు 33% కోటా
ప్రతి కుటుంబానికీ ఇల్లు
కాపులకు తొమ్మిదో షెడ్యూల్‌లో రిజర్వేషన్లు
బీసీలకు 5 శాతం రాజకీయ కోటా
సీపీఎస్‌ విధానం రద్దు
జనసేన ఎన్నికల ప్రణాళిక విడుదలఈనాడు - అమరావతి

ధికారంలోకి వస్తే 60ఏళ్లు దాటిన రైతులకు రూ.5,000 పింఛను ఇస్తామని జనసేన హామీ ఇచ్చింది. పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామని, ఆరోగ్య బీమాను 10 లక్షలకు పెంచుతామని, కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని, బీసీలకు, మహిళలకు రాజకీయ కోటా ఇస్తామని వెల్లడించింది. ప్రతి కుటుంబానికీ ఇంటి సౌకర్యం కల్పిస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖల్లో యుద్ధ ప్రాతిపదికన ఖాళీల భర్తీ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పన తమ లక్ష్యమని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేస్తామని ప్రకటించింది. రాజమహేంద్రవరంలో గురువారం జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రణాళికను (మేనిఫెస్టో) విడుదల చేశారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలివీ...

అన్నదాతకు అండ
* 60 ఏళ్లు నిండిన చిన్న, సన్నకారు రైతులకు, కౌలుదారులకు నెలకు రూ.5,000 పింఛను.
* రైతులను సంపన్నులను చేయడానికి ప్రభుత్వ సాయంతో ‘ఆపర్చ్యూనిటీ జోన్ల’ ఏర్పాటు.
* ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.5,000 కోట్లతో అంతర్జాతీయ మార్కెట్‌.
* రైతులకు ఉచితంగా సౌర విద్యుత్తు మోటార్లు.
* ప్రకాశం జిల్లాలో సాగు, తాగునీటి కోసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి. రాయలసీమలో అధునాతన వ్యవసాయ విధానం అమలు. ఉత్తరాంధ్ర సుభిక్షానికి నదుల అనుసంధానం.


విద్యకు పెద్దపీట
* ఒకటో తరగతి నుంచి పీజీ వరకు ఉచిత విద్య, బస్‌పాస్‌ సౌకర్యం. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ఉచిత క్యాంటీన్లు. జూనియర్‌ కళాశాల స్థాయి నుంచి విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌.
* ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆర్ట్స్‌, సైన్సు, వ్యవసాయ, పాలిటెక్నిక్‌ కళాశాలల ఏర్పాటు.
* అన్ని ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఏడాదికోసారి మాత్రమే రుసుముల వసూలు. సామాజికవర్గాల విద్యార్థులకు సర్వ సమానత్వ వసతిగృహాలు.
* వృత్తి విద్యా కళాశాలల్లో ఇన్నోవేషన్‌ హబ్‌, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు.


వైద్యానికి బడ్జెట్‌ పెంపు
* రూ.10 లక్షలతో అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. దశల వారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 30 పడకల ఆసుపత్రులుగా అభివృద్ధి. మండలానికో సంచార రోగ నిర్ధారణ కేంద్రం.


ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
* ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్‌, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఆరు నెలల్లో భర్తీ.
* నూతన పారిశ్రామికవేత్తల కోసం రూ.10వేల కోట్లతో నిధి.
* చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక ఆర్థిక సాయం.


మహిళా సంక్షేమానికి ప్రాధాన్యం
* అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పన. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో స్వయం ఉపాధి సంఘాల మహిళలకు ప్రాధాన్యం.
* గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ కనెక్షన్‌. ప్రతి సంక్రాంతికి ఆడపడుచులకు చీరల పంపిణీ. రేషన్‌కు బదులుగా మహిళల ఖాతాల్లో రూ.2,500 నుంచి రూ.3,500 జమ.
* ప్రతి జిల్లాలో మహిళా బ్యాంకు ఏర్పాటు.


బడుగుల అభివృద్ధే ధ్యేయం
* కాపులకు తొమ్మిదో షెడ్యూల్‌ నుంచి రిజర్వేషన్ల కల్పన.
* ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ సిఫార్సుల అమలు.
* అవకాశాన్ని బట్టి బీసీలకు 5 శాతం రాజకీయ రిజర్వేషన్లు.
* ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం.


సంక్షేమమే లక్ష్యంగా..
* వృద్ధాశ్రమాల ఏర్పాటు.
* అర్ధ రూపాయి వడ్డీతో బంగారు నగల తాకట్టు రుణాలు.
* చిరు వ్యాపారులకు పూచీకత్తు లేకుండా రూ.5000 వరకూ పావలా వడ్డీతో రుణం.
* అపార్టుమెంట్లు నిర్మించి ప్రతి కుటుంబానికీ ఉచితంగా ఇంటి సౌకర్యం.


మత్స్యకారుల కోసం...
* ప్రత్యేకంగా మత్స్యశాఖ. ఫిషరీస్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు.
* 300 రోజుల ఉపాధి కల్పన, విరామం, తుపానుల హెచ్చరిక సమయంలో చేపల వేటకు వెళ్లలేని సమయంలో రోజుకు రూ.500 ఆర్థిక సాయం.


రెల్లి సంక్షేమం...
* రెల్లి యువత ఉపాధి కోసం రూ.50,000 వరకూ వడ్డీలేని రుణం. రెల్లి కార్మికులకు ఆటో రిక్షా కొనుగోలుకు 50% సబ్సిడీపై రుణం. ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న రెల్లి మహిళలకు ఉచిత స్కూటరు, ఉచిత గృహ సదుపాయం.
స్థానిక సంస్థల బలోపేతం
* అబ్దుల్‌ కలాం ఆశయం మేరకు గ్రామాలన్నింట్లో నగర వసతుల కల్పన.

 

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.