Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 176464
            [news_title_telugu_html] => 

రాజధానిని మార్చే కుట్ర

[news_title_telugu] => రాజధానిని మార్చే కుట్ర [news_title_english] => [news_short_description] => ‘ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు.. కానీ రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతోనే ప్రమాదకరంగా 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారు’ అని తెదేపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓవైపు వరద ముంపునకు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => |https://www.youtube.com/embed/GYTJkiCFs58 [news_videoinfo] => |https://www.youtube.com/embed/GYTJkiCFs58 [news_sections] => ,25, ) )
రాజధానిని మార్చే కుట్ర - EENADU
close
రాజధానిని మార్చే కుట్ర

అందుకే కృత్రిమ వరద సృష్టి
నా ఇంటినీ ముంచాలన్నదే వైకాపా లక్ష్యం
కానీ రైతులు మునిగిపోయారు
చంద్రబాబు వ్యాఖ్యలు
ముంపు ప్రాంతాల్లో పర్యటన

‘ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం 3 టీఎంసీలు.. కానీ రాజధాని ప్రాంతాన్ని ముంచాలనే ఉద్దేశంతోనే ప్రమాదకరంగా 4 టీఎంసీల నీటిని బ్యారేజీలో నిల్వ ఉంచారు’ అని తెదేపా అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఓవైపు వరద ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే. వారిని పట్టించుకోకుండా తన ఇంటి చుట్టే వైకాపా నాయకులు తిరగడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘నా ఇల్లు మునిగిపోతే ఓనర్‌కు ఇబ్బంది.. మీకెందుకు బాధ?’ అని మంత్రుల తీరుపై మండిపడ్డారు. కృష్ణా జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం చంద్రబాబు పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను, ఇళ్లను పరిశీలించడంతోపాటు.. బాధితులను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి ముంపు ప్రాంతమని బొత్స వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా రైతులు 33వేల ఎకరాలను ఇచ్చారని, రాజధాని నిర్మాణంలో అన్ని మౌలిక సదుపాయాలుపోగా.. 8వేల ఎకరాల వరకు మిగులుతుందని, వాటిని అమ్ముకున్నా ఖర్చు లేకుండా రాజధానిని పూర్తి చేయొచ్చని తెలిపారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ఇప్పుడు ముంపు ప్రాంతమంటూ చర్చ లేపుతున్నారని ఆరోపించారు. ఖర్చు ఎక్కువ అంటూ అమరావతిని పూర్తిగా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై ఎంతవరకైనా పోరాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్‌కు చెందిన పీఏ పాయ్‌ జగన్‌ చర్యలను ప్రభుత్వ ఉగ్రవాదంగా అభివర్ణించారని గుర్తు చేశారు. ఇలా వ్యవహరిస్తే పెట్టుబడులు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని, అవినీతిపరుడే అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతిని మార్చే కుట్రలో భాగంగా ప్రజలను వరద నీటిలో ముంచారు. నీరు ఉన్నచోటే నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే కృష్ణా నది ఒడ్డున అమరావతిని నిర్మించేందుకు తలపెట్టాం. పెద్ద నగరాలు నదుల పక్కన ఉండటంవల్లే అభివృద్ధి చెందాయి.

ప్రస్తుత వరదలు సహజంగా వచ్చినవి కావు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో వర్షాలు కురిశాయి. ప్రాజెక్టులలో కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే వరద వచ్చేదే కాదు. నేను ఉంటున్న ఇంటిని ముంచడానికే నీళ్లను ఆపి ఒకేసారి వదిలారు. ఇవి కృత్రిమంగా సృష్టించిన వరదలు.

- చంద్రబాబు నాయుడు

వరద నిర్వహణలో ఘోర వైఫల్యం
‘వరద బాధితులకు కనీసం భోజన సదుపాయమూ కల్పించడం లేదని, ఆదుకునే అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఎత్తివేసిందని చంద్రబాబు విమర్శించారు. ‘వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సహాయక చర్యలను సరిగ్గా పర్యవేక్షించలేదు. ఫలితంగా ప్రజలకు అపారనష్టం వాటిల్లింది’ అని పేర్కొన్నారు. కరకట్ట వెంట ఉన్న గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన చంద్రబాబు.. వరదలతో నష్టపోయిన వారందరికీ పూర్తిగా న్యాయం జరిగే వరకు తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒకవైపు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దాదాపు 250 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైందని, ఈ నీటితో రాయలసీమలోని ప్రాజెక్టులను నింపే యోచననే ప్రభుత్వం చేయలేదని చంద్రబాబు విమర్శించారు. నీరందక పంటలు ఎండిపోయి సీమ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై ప్రభుత్వం కనీసం సమీక్ష చేయకుండా వదిలేసిందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పత్తాలేరని ఎద్దేవా చేశారు.

- ఈనాడు, ఈనాడు డిజిటల్‌-విజయవాడ

నేడు గుంటూరు జిల్లాలో...
కొల్లిపర, వేమూరు, న్యూస్‌టుడే: ముంపుబారిన పడిన గుంటూరు జిల్లాలోని పలు లంక గ్రామాల్లో చంద్రబాబు బుధవారం పర్యటించనున్నట్లు మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌, నక్కా ఆనందబాబు తెలిపారు. కొల్లూరు మండలం వెల్లటూరు నుంచి ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభమవుతుందని వెల్లడించారు.


బాబూ.. అసెంబ్లీకి వెళ్లొద్దు
చంద్రబాబుకు రైతుల వినతి

తోట్లవల్లూరు, న్యూస్‌టుడే: ‘‘అసెంబ్లీలో మిమ్మల్ని ఒక్కరినీ చేసి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, మిగతా సభ్యులంతా హేళనగా మాట్లాడుతున్నారు. మీరు అసెంబ్లీకి వెళ్లొద్దు’’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రైతులు కోరారు. మంగళవారం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లిలో తమను పరామర్శించడానికి వచ్చిన ఆయనతో రైతులు మాట్లాడారు. జగన్‌ ముఖ్యమంత్రిలా వ్యవహరించట్లేదన్నారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. వారంతా తనను రెచ్చగొట్టడానికే మాట్లాడుతున్నారన్నారు. దీనికి తాను భయపడనని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని మాటలైనా పడతానని చెప్పారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.