Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009440
            [news_title_telugu_html] => 

చలో ఆత్మకూరు కొనసాగిస్తాం

[news_title_telugu] => చలో ఆత్మకూరు కొనసాగిస్తాం [news_title_english] => [news_short_description] => ‘చలో ఆత్మకూరు’ను కొనసాగిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా బాధితులను ఆత్మకూరు గ్రామానికి తానే స్వయంగా తీసుకెళ్తానని, గృహనిర్బంధాలు, అరెస్టులతో తమను అడ్డుకోలేరని పేర్కొన్నారు. తమను ఎన్ని రోజులు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,25, ) )
చలో ఆత్మకూరు కొనసాగిస్తాం - EENADU
close
చలో ఆత్మకూరు కొనసాగిస్తాం

 నిర్బంధాలు, అరెస్టులతో  మమ్మల్ని అడ్డుకోలేరు
 మాజీ ముఖ్యమంత్రితో  వ్యవహరించే తీరు ఇదేనా?
 బాధితుల్ని స్వస్థలాలకు స్వయంగా తీసుకెళ్తా
 తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
ఈనాడు డిజిటల్‌ - అమరావతి

‘చలో ఆత్మకూరు’ను కొనసాగిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. వైకాపా బాధితులను ఆత్మకూరు గ్రామానికి తానే స్వయంగా తీసుకెళ్తానని, గృహనిర్బంధాలు, అరెస్టులతో తమను అడ్డుకోలేరని పేర్కొన్నారు. తమను ఎన్ని రోజులు గృహనిర్బంధంలో ఉంచుతారో చూస్తామని సవాల్‌ చేశారు. డీజీపీ, పోలీసులు ఏం చేస్తారో చేసుకోవాలని, తాము రాజీపడే సమస్యే లేదని స్పష్టం చేశారు. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లోనూ, పార్టీ సీనియర్‌ నేతలతో జరిగిన సమావేశంలోనూ, విలేకరులతో వేర్వేరుగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైందని, న్యాయం చేయాలని కోరుతున్న తెదేపాపై కక్ష సాధిస్తోందని ధ్వజమెత్తారు. తెదేపా నేతలను అరెస్టు చేస్తే బాధితులకు న్యాయం జరుగుతుందా అని ధ్వజమెత్తారు. ‘‘గుంటూరులో వైకాపా బాధితుల కోసం నిర్వహిస్తున్న పునరావాస శిబిరంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నా. అసలు పునరావాస శిబిరం ఏర్పాటుచేసే పరిస్థితి తెచ్చింది వైకాపా కాదా? ఆత్మకూరుకు నేను వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొనడం హాస్యాస్పదం. 110 రోజులుగా పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు కనిపించడంలేదా? ఇప్పుడు నేను వెళ్లడం వల్ల ఉద్రిక్తత పెరిగిందేముంది? శిబిరంపెట్టి 9 రోజులవుతున్నా ఎందుకని చర్యలు తీసుకోలేదు. మీరు ఊళ్లోకి తీసుకెళ్లరు. నేను స్వయంగా తీసుకెళ్తానంటే అంగీకరించరు? నా ఇంటి గేటుకి తాళ్లు కట్టి, బయటకు వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం అత్యంత దుర్మార్గం. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిపట్ల ఇలా ప్రవర్తించడం దారుణం’’అని మండిపడ్డారు.

వారికేమైనా జరిగితే బాధ్యత పోలీసులదే
‘‘బాధితుల సమస్యను పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వంలో ఏ మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. శిబిరంలోని బాధితులను పోలీసులు బలవంతంగా స్వగ్రామాలకు తరలించడం సరికాదు. ముందు వారిలో విశ్వాసం కల్పించాలి. దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి. బలవంతంగా తరలించిన తర్వాత మళ్లీ వాళ్లకు ఊళ్లో ఏమైనా జరిగితే అందుకు పోలీసులే బాధ్యత వహించాలి’’ అని పేర్కొన్నారు.

ఇన్ని వేల మంది పోలీసులా?
‘‘ఇంత పెద్దఎత్తున గృహనిర్బంధాలు, అరెస్టులు చరిత్రలో చూడలేదు. ఇన్ని వేల మంది పోలీసులను మోహరిస్తారా? ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? ఇదే తరహాలో పోలీసులను బాధితులకు అండగా ఉంచితే పరిస్థితి ఇలా ఉండేదా?’ అని అన్నారు.

పోలీసులది అత్యుత్సాహం
‘‘తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, బీసీ నేతలు దువ్వారపు రామారావు, జగదీష్‌లను అవమానిస్తారా? ఎస్సీ వర్గానికి చెందిన మాజీ మంత్రి జవహర్‌, మహిళానేతలు నన్నపనేని రాజకుమారి, భూమా అఖిలప్రియ, వంగలపూడి అనితతో అనుచితంగా ప్రవర్తిస్తారా? వారిని మంగళగిరి, దుగ్గిరాల, తెనాలి ఇలా ఎన్ని పోలీస్‌స్టేషన్లకు తిప్పుతారు? పునరావాస శిబిరంలో ఉన్న బాధితులకు భోజనం కూడా అందించకుండా ఆంక్షలు అమలు చేశారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ప్రవర్తన చూస్తే బాధేస్తోంది
‘‘దళిత కుటుంబాలపై దాడులకు పాల్పడ్డారు. హృదయ విదారక సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. 125 ఎస్సీ కుటుంబాలు 100 రోజులు ఊరొదిలి చెట్టుకొకరు, పుట్టకొకరు చెల్లాచెదురైతే మీరు పట్టించుకోలేదు. ఓ ఎస్సీ మహిళపై దాడి చేస్తే 14 కుట్లు పడ్డాయి. ఒక వ్యక్తి 40 ఎకరాల పొలం విడిచిపెట్టి కూలీగా మారారు. చట్టాన్ని ఎవరెవరు ఉల్లంఘించారో గుర్తించి చర్యలు తీసుకోవాలి. వారికి పౌరహక్కులు కల్పించాలి. మానసికంగా, శారీరకంగా ఆటంకాలు కలిగించినా, అవమానపరిచినా నా పోరాటం ఆపను’’ అని పేర్కొన్నారు.

అరెస్టులు చేతకానితనానికి నిదర్శనం: లోకేశ్‌

ప్రభుత్వ వైఫల్యాలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమను అరెస్టు చేయించి వైకాపా నేతలు వికృతానందం పొందుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. ప్రభుత్వ చేతకానితనానికిది నిదర్శనమని ట్విటర్‌లో ఆయన విమర్శించారు. వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి మాట్లాడుతున్న ఓ వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ‘పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని వైకాపా నేతలు రౌడీయిజం చేస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి?’ అని ప్రశ్నించారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.