Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 219009441
            [news_title_telugu_html] => 

ఇసుకపై విమర్శలు రానివ్వొద్దు

[news_title_telugu] => ఇసుకపై విమర్శలు రానివ్వొద్దు [news_title_english] => [news_short_description] => ఇసుక సరఫరాలో అవినీతిని అడ్డుకోగలిగామని, దానిని సహించలేని వారే ఇంకా విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి వాటికీ తావులేకుండా సరఫరా పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [news_sections] => ,25, ) )
ఇసుకపై విమర్శలు రానివ్వొద్దు - EENADU
close
ఇసుకపై విమర్శలు రానివ్వొద్దు

అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశం
ఈనాడు - అమరావతి

ఇసుక సరఫరాలో అవినీతిని అడ్డుకోగలిగామని, దానిని సహించలేని వారే ఇంకా విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి వాటికీ తావులేకుండా సరఫరా పారదర్శకంగా జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. గ్రామ సచివాలయాల్లో 237 రకాల పౌర సేవలు అందించాలని, ప్రతి మండలానికో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సచివాలయంలో బుధవారం ఇసుక విధానం, గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యాశాఖలపై వేర్వేరుగా ఆయన సమీక్షలు నిర్వహించారు.
‘వరదలు తగ్గగానే రేవుల నుంచి ఎక్కువ ఇసుకను నిల్వ కేంద్రాలకు చేర్చాలి. రేవులు, నిల్వ కేంద్రాల సంఖ్యను పెంచండి. ఇసుక సరఫరాలో అక్రమాలు జరగకుండా సాంకేతిక సహకారం తీసుకోండి. అన్ని చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. నిర్మాణ, అనుబంధ రంగాలపై ఇసుక లేకపోవడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కూలీలు పనులు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కొరత ఎక్కడుంది? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనేది నిర్మాణదారులకు ముందుగానే సమాచారం అందిస్తే బాగుంటుంది. ఎక్కువ మొత్తంలో ఇసుక ఉపయోగించే వారి కోసం ప్రత్యేకంగా నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయండి’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదల కారణంగా రేవులు, నిల్వ కేంద్రాల్లో తవ్వి ఉంచిన ఇసుక కొట్టుకుపోయిందని ఏపీఎండీసీ, గనులశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 23వేల టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు.

సచివాలయాలపై..
గ్రామ సచివాలయాల్లో 237 రకాల పౌర సేవలను అందించాలని, వీటిలో ప్రత్యేకించి 115 సేవలను అవి ఏర్పాటైన 72 గంటల్లోగా సమకూర్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థపై పర్యవేక్షణ అవసరమని, 4 లక్షల మందితో పని చేయించుకోవడాన్ని ప్రాధాన్య అంశంగా గుర్తించాలని, ఇందుకోసం మంచి సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

ఎమ్మార్వో, ఎంపీడీవో, కలెక్టరు నుంచి ఉన్నతస్థాయిలో సంబంధిత ప్రభుత్వశాఖల కార్యదర్శుల వరకు సచివాలయాలను అనుసంధానించాలని ఆదేశించారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబరు కేటాయించాలని, సమాచారాన్ని నిక్షిప్తం చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇళ్ల స్థలాలపై వాలంటీర్ల సర్వే, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికపై ఆరాతీశారు. లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. డిసెంబరులో కొత్త పింఛన్లు ఇవ్వాలని సూచించారు.

ఈ నెల చివరి వారంలో ఫలితాలు
గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షల ఫలితాలను ఈనెల చివరి వారంలో విడుదల చేస్తామని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనరు గిరిజా శంకర్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌సెంటర్‌ నంబరు 1902 సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలాలపై సర్వే పూర్తయిందని, రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేనిచోట వార్డు సచివాలయాల కోసం ప్రైవేటువి అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు.

విద్యాశాఖపై...
ప్రతి మండలానికో జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విడతలవారీగా ఇంటర్‌ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి ఒక జూనియర్‌ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి విడతలో 15,410 పాఠశాలల్లో 9 రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాల యాజమాన్య కమిటీలను (ఎస్‌ఎంసీ) తల్లిదండ్రుల యాజమాన్య కమిటీలుగా మార్చాలని, ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన సాగాలని, ఆ తర్వాత 9, 10 తరగతులకూ విస్తరించాలని ఆదేశించారు. ఉపాధ్యాయ ఖాళీలను ఏటా జనవరిలో భర్తీ చేయాలని, ఏ శాఖ పరీక్షలైనా జనవరిలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు. పర్యావరణం, వాతావరణ మార్పులు, రహదారి భద్రతను పాఠ్యాంశాలుగా తీసుకురావాలని, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు, స్కూలు బ్యాగులను వచ్చే ఏడాది నుంచి పాఠశాలల ప్రారంభం రోజునే అందించాలని ఆదేశించారు. ప్రైవేటు కళాశాలలకు అనుమతులు ఇవ్వడం లేదన్నది వాస్తవం కాదని, సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా? లేదా అన్నది చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారంగా అరటిపండు, కిచిడీ, పల్లీ చిక్కీలు అందించడంపై ప్రతిపాదనలను రూపొందించాలని సూచించారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.