close
పొరుగు సేవకులకు శుభవార్త

త్వరలో ప్రత్యేక కార్పొరేషన్‌
ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం

ఈనాడు, అమరావతి: పొరుగు సేవల ఉద్యోగాల నియామకాల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుకు ముఖ్యమంత్రి జగన్‌ పచ్చజెండా ఊపారు. ఈ నియామకాల్లో మహిళలకు 50% కేటాయించాలని ఆదేశించారు. సాధారణ పరిపాలనశాఖ ఆధ్వర్యంలో ఎలాంటిలాభాపేక్ష లేకుండా కార్పొరేషన్‌ పని చేస్తుందని సీఎం కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎన్నికల ముందు జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.

* కార్పొరేషన్‌కు అనుబంధంగా జిల్లాల స్థాయిలో ఇన్‌ఛార్జి మంత్రుల నేతృత్వంలో విభాగాలు ఏర్పాటవుతాయి. కలెక్టర్లు ఎక్స్‌అఫీషియో అధికారులుగా వ్యవహరిస్తారు.
* రాష్ట్రంలో వివిధ విభాగాల కింద లక్ష మంది పొరుగుసేవల ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకేరకమైన పనులు చేస్తున్నా ఆ మేరకు జీతాలు ఇవ్వడం లేదు. అవి కూడా సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటుతో పొరపాట్లకు తావు లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా జీతాల చెల్లింపులు జరుగుతాయి.
* రాష్ట్ర, జిల్లా స్థాయిలోని ప్రభుత్వ విభాగాలు తమకు కావాల్సిన సేవలను కొత్తగా ఏర్పాటవుతున్న కార్పొరేషన్‌కు నివేదించాల్సి ఉంటుంది.
* ఒకే పోర్టల్‌ ద్వారా అన్ని పొరుగు సేవల ఉద్యోగ నియామకాలు చేపడతారు. దళారులు, ఏజెన్సీలు లేకుండా నేరుగా ఉద్యోగాలను పొందే వీలుంటుంది. అట్టడుగు వర్గాల వరకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. ఒకే రకమైన పనికి సమాన వేతనం లభిస్తుంది.
* అక్టోబరు 16న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కార్పొరేషన్‌ ఏర్పాటుకు ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. డిసెంబరు 1వ తేదీ నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.