close
న్యాయసమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌ సమన్వయానికి ప్రత్యేక అధికారి

నవంబరు 1 నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా సేవలు
  అధికారులతో సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: నవంబరు 1 నుంచి ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వపరంగా జరిగే కొనుగోళ్లలో న్యాయసమీక్ష, రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలు సాఫీగా జరిగేలా సమన్వయం చేసుకునేందుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వివిధశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ-పద్ధతుల్లో బిడ్‌ దక్కించుకున్న వారికి చెల్లింపులు వేగంగా జరిగేలా ఒక లింక్‌ ఏర్పాటు చేయాలని చెప్పారు. రూ.100 కోట్ల పైబడిన పనులను ముందస్తు న్యాయ సమీక్షకు నివేదించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. జనవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి తేవాలని ఆదేశించారు.

సమావేశంలో సీఎం చేసిన సూచనలివీ..
* రూ.10 లక్షలకు పైబడి, రూ.100 కోట్ల లోపు పనులు, కొనుగోళ్ల విషయంలో సంస్కరణలు తెస్తున్నాం. టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా ఒక విధానం ఉండాలి. అందులో పేర్కొనే అంశాలు సరళంగా, అందరికీ అందుబాటులో ఉండాలి. తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను ఈ-ప్రొక్యూర్‌మెంట్‌లో ప్రదర్శించాలి. వారంపాటు అందరికీ అందుబాటులో ఉంచాలి. ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలి. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలి. ప్యాకేజీల వారీగా ఎక్కువమంది పోటీ పడేలా, పాల్గొనేలా చూడాలి.
* రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ కోసం కనీసం అయిదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60 శాతం (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే ఎల్‌1 నుంచి ఎల్‌6 వరకు) మంది అర్హులయ్యేలా చూడాలి. ఈ విధానం పోటీకి దారి తీసేలా ఉండాలి.
* న్యాయసమీక్షకు టెండరు వెళ్లగానే సంబంధితశాఖ అధికారి అక్కడకు వెళ్లి న్యాయమూర్తికి దాని గురించి వివరించాలి. తమ శాఖల నుంచి సాంకేతిక సహకారం అందించే వ్యక్తుల వివరాలూ సూచించాలి.

 

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.